Sunday, December 22, 2024

నేడు భారత్‌-శ్రీలంక మధ్య రెండో వన్డే.. ఇరుజట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనుంది. శుక్రవారం ఇరు జట్ల మద్య జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే కిందటి మ్యాచ్‌లో ఇటు శ్రీలంక, అటు భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాయి. రెండు జట్లను కూడా బ్యాటింగ్ సమస్య వెంటాడింది.

కానీ కీలకమైన రెండో వన్డేలో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే లక్షంతో ఇరు జట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ, గిల్, కోహ్లి, అయ్యర్, పంత్ తదితరులతో భారత్ బలంగా ఉంది. లంకలో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News