Monday, December 23, 2024

స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయిన లంక..

- Advertisement -
- Advertisement -

సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో స్వల్ప వ్యవధిలో శ్రీలంక రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు గుణతిలక, నిశాంకలు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అర్థ శతకం భాగస్వమ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత గుణతిలక(38) భారీ షాట్ కు యత్నించి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అసలంక(02), చాహల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

IND vs SL 2nd T20: Charith Asalanka gone for 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News