Monday, December 23, 2024

మెండీస్ మెరుపు హాఫ్ సెంచరీ.. స్వల్ప వ్వవధిలో రెండు వికెట్లు డౌన్

- Advertisement -
- Advertisement -

పుణె: టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో శ్రీలంక జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకుకు ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్ తో భారీ బాగ్యస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్ కుశాల్ మెండీస్ ధనాధన్ బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయిన మెండీస్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన రాజపక్సా, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో శ్రీలంక 83 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శ్రీలంక 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ నిస్సంక(29), అసలంక(1)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News