బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(4), రోహిత్ శర్మ(15)లు మరోసారి నిరాశపర్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(17), హనుమ విహారీ(34)లు కూడా స్వల్ప వ్యవధిలో ఔటై పెవిలియన్ చేరారు. దీంతో 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడిన సమయంలో రిషబ్ పంత్(35)తో జతకట్టిన శ్రేయస్ అయ్యర్(92) ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. ఓ ఎండ్ లో వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్ చేరుతుంటే..అయ్యర్ మాత్రం బౌండరీలతో లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే, సెంచరీకి చెరువగా వచ్చిన శ్రేయస్ ఔట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. భారత్ 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో లసిత్ జయ వియవిక్రమలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డిసిల్వాకు రెండు వికెట్లు, లక్మల్ ఒక వికెట్ తీశారు.
IND vs SL 2nd Test: India all out at 252 runs