చెలరేగిన శ్రేయస్, రిషబ్.. రాణించిన రోహిత్
టీమిండియా రెండో ఇన్నింగ్స్ : 303డిక్లేర్
లంక రెండో ఇన్నింగ్స్ : 28/1
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్(50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్(46), విహారి(35), జడేజా(22), మయాంక్(22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని శ్రీలంక ముందు టీమిండియా 447 పరుగుల టార్గెట్ ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకేయులు ఒక వికెట్(ఒపెనర్ లాహిరు తిరుమన్నె) కోల్పోయి 28 పరుగులు చేసింది. కాగా, భారత బౌలర్లలో బూమ్ర ఒక వికెట్ పడగొట్టాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించడం లాంఛనంగానే కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ (92) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా 143 పరుగుల కీలకమైన ఆధిక్యం సాధించింది.
IND vs SL 2nd Test: India declared at 303/9 in 2nd Innings