బెంగళూరు: చినస్వామి స్టేడియం వేదికగా టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 28/1తో ఆట ప్రారంభించిన లంక బ్యాట్స్ మెన్స్ కరుణరత్నె(38), కుశాల్ మెండీస్(35)లు నిలకడగా ఆడుతున్నారు. దీంతో లంక జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.
కాగా, రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్(50), శ్రేయస్ అయ్యర్(67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్(46), విహారి(35), జడేజా(22), మయాంక్(22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని శ్రీలంక ముందు టీమిండియా 447 పరుగుల టార్గెట్ ఉంచింది.
IND vs SL 2nd Test: Mendis and Karunaratne Starts Day 3