Monday, December 23, 2024

శ్రీలంకతో చివరి టీ20: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా…

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషాన్(1) తొలి ఓవర్ లో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(35) ధనాధన్ బ్యాటింగ్ అలరించాడు.

భరీ షాట్ ఆడే క్రమంలో రాహుల్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(36), మరో ఓపెనర్ శుభమన్ గిల్(29)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే అర్థ శతక భాగ్యస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో 104 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News