Monday, December 23, 2024

శ్రీలంకతో నేడు చివరి టీ20.. క్లీన్ స్వీప్ పై భారత్ గురి

- Advertisement -
- Advertisement -

ఆతిథ్య జట్టు శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య మంగళవారం చివరి మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. పల్లెకెలెలో జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లో గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని శ్రీలంక భావిస్తోంది, కాగా, ఈ మ్యాచ్ కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ కండరాలు పట్టేయడంతో రెండో టీ20లో కూడా గిల్ ఆడలేదు.

టీ20 సిరీస్ తర్వాత శ్రీలంక జట్టుతో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలు లంక చేరుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News