Monday, December 23, 2024

సూర్య ఊచకోత… టీమిండియా 228/5

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్:మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా చివరి మూడో టీ20లో టీమిండియా, శ్రీలంక జట్టుకు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. లంక బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకుపడిన సూర్య కేవలం 51 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సులతో 112 పరుగులు చేశాడు. సూర్యతోపాటు రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21)లు కూడా చెలరేగడంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News