Sunday, January 19, 2025

గెలుపే లక్ష్యంగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

నేడు అమెరికాతో పోరు
న్యూయార్క్ : టి20 వరల్డ్ కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుస రెండు మ్యాచ్‌లలో గెలుపొంది గ్రూప్‌ఎ టేగూప్‌ఎ టాపర్‌గా కొనసాగుతోంది. అదే జోరుతో అతిధ్య అమెరికా జట్టుతో పోరుకు సిద్ధమైంది. బుధవారం జరుగన్ను ఈమ్యాచ్‌లో నెగ్గి నేరుగా సూపర్8లోకి దూసుకెళ్లాలని యోచిస్తోంది. పాకిస్థాన్‌పై విజయం సాధించిన అమెరికా అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో సయితం గెలిచి టేబుల్ టాపర్ నిలవాలని చూస్తోంది. ఐర్లాండ్ జట్టుపై సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేన.. పాకిస్థాన్‌పై చివరిదాకా పోరాడి గెలిచింది. టీమిండియా బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో విజయతీరాలకు చేరింది. ఇక పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మందకొడి పిచ్‌పై పరుగులు చేయలేక చతికిలాపడింది. భారత బ్యాటర్లు అత్యంత సులువుగా వికెట్లు సమర్పించుకోవడం అభిమానులను నివ్వెరపరిచింది. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఆ తర్వాత 9 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్ల కోల్పోవడం కాస్తా ఆందోళన కలిగించే విషయమనే చెప్పొచ్చు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, శివం దుబే విఫలమయ్యారు. 8 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేశాడు సూర్యా. పాకిస్తాన్‌తో జరిగిన టి20 లలో వరుసగా 11, 18, 15, 7 పరుగులు చేశాడు. ఐపిఎల్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టు చోటు సంపాదించిన శివం దూబే.. వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక వీరిద్దరూ ఫామ్‌లోకొస్తే అమెరికా జట్టుకు చుక్కలు చూపెట్టడం ఖాయమనే చెప్పొచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ రాణిస్తుండగా కోహ్లీ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగి మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తున్నాడు.
ధూబె వర్సెస్ రింకూ సింగ్..
వరల్డ్ కప్‌లో విఫలమవుతున్న ధోని శిష్యుడు శివం దూబేను అమెరికాతో జరిగే మ్యాచ్‌కు పక్కన పెడతారని ప్రచారం జరుగుతుంది. అతని స్థానంలో రింకూ సింగ్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.. వాస్తవానికి టీమిండియాకు ఎంపికైనప్పటికీ రింకూ సింగ్ జట్టులో సభ్యుడు కాదు. అతడు కేవలం రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే ఎంపికయ్యాడు. అనుకోకుండా ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే వారి స్థానంలో ఆడించేందుకు రింకూ, శుభ్ మన్ గిల్, ఆవేష్ ఖాన్‌ను ఎంపిక చేశారు. ఇక భారత్ బౌలింగ్ విభాగంలో పటిఫ్టంగా ఉంది. పేపర్లు బుమ్రా, సిరాజ్‌లు బాల్‌తో ప్రతార్థులను బెంబేలెత్తిస్తుండాగా వారి తోడు యాజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు స్పిన్ మాయ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సయితం బౌలింగ్ దళం పకడ్బంధిగా రాణిస్తే అమెరికా చిత్తు కావడం ఖాయమనే చెప్పొచ్చు.
తక్కువ అంచనా వేయలేం..
ఇక అమెరికా జట్టు నిండా భారత సంతతి ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు. కెప్టెన్ మోనాంక్ పటేల్‌తోపాటు బౌలర్లు సౌరభ్ నేత్రావాల్కర్, హర్మిత్‌సింగ్, జస్‌దీప్ సింగ్, నితీశ్‌కుమార్‌తో టీమిండియా ముప్పే. పాకిస్థాన్‌పై మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీతో విజృంభించాడు. మోనాంక్ ఇన్నింగ్స్ అమెరికాను గెలిపించిన విషయం తెలిసిందే. మరో స్టార్ ఆటగాడు ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కెనడాపై 94 పరుగులు చేసి అజేయంగా నిలవగా ఆంద్రీస్ గౌస్ అర్ధశతకం బాదాడు. పాక్‌తో మ్యాచ్‌లోనూ వీరిద్దరూ రాణించారు. వీరిని తక్కువ స్కోరుకే భారత్ కట్టడి చేయకుంటే పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఆడిన అనుభవం అమెరికా బ్యాటర్లు సులువుగా పరుగులు రాబడుతున్నారు. ఇక బౌలింగ్‌లోనూ అమెరికా బలంగా కనిపిస్తోంది, స్పిన్నర్ నోస్తుష్ కెంజిగే బాల్‌తో చెలరేగుతున్నాడు. పాక్‌పై అతడు మూడు వికెట్లు పడగొట్టి నడ్డీ విరిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News