పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సమరానికి యువ భారత జట్టు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే జరుగనుంది. టీమిండియా కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, బు మ్రా, కెఎల్ రాహుల్, అశ్విన్, హార్దిక్ తదితరులకు వన్డే సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. దీంతో వీరు లేకుండానే భారత్ ఈ పోరుకు సిద్ధమైంది. ఇక ధావన్ సారథ్యంలో యువకులతో కూడిన జట్టును సిరీస్‌కు ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టులో ధావన్, రవీంద్ర జడేజాలు మాత్రమే అ నుభవజ్ఞులు. మిగిలిన వారిలో అందరు యువ ఆటగాళ్లే ఉన్నారు. వీరు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక సిరీస్‌లో కెప్టెన్ ధావన్‌తో పాటు వైస్ కెప్టెన్ జడేజాలు జట్టుకు చాలా కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బా ధ్యత వీరిపై నెలకొది. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సంజూ శాంసన్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరు రాణించినా టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. సూర్యకుమార్ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. హుడా కూడా సత్తా చాటేందుకు సి ద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే యువ ఆటగాళ్లకు భారత్‌లో కొదవలేదు. ఇక శార్దూల్ ఠాకూర్, జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండనే ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్ తదితరులతో బలమైన బౌలింగ్ విభాగం కూడా భారత్‌కు అందుబాటులో ఉంది. మరోవైపు ప్రపంచంలోని ఇతర జట్లతో పోల్చితే టీమిండియాకు పటిష్టమైన రిజర్వ్‌బెంచ్ ఉంది. ఈ ఆటగాళ్లతో కనీసం మరో రెండు జట్లను బరిలోకి దించే వెసులుబాటు భారత్‌కు ఉందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు నికోలస్ పూరన్ సారథ్యంలోని ఆతిథ్య వెస్టిండీస్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. విండీస్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో ఫ లితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన పూరన్, షాయ్ హోప్, హోల్డర్, షమర్ బ్రూక్స్, కిల్ మేయర్స్, అల్జరీ జో సెప్ తదితరులు విండీస్‌కు అందుబాటులో ఉన్నారు. వీరి లో ఒకరిద్దరు రాణించినా టీమిండియాకు గట్టి పోటీ త ప్పక పోవచ్చు. దీంతోపాటు సొంత గడ్డపై ఆడనుండడం విండీస్‌కు కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగా ళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
IND vs WI 1st ODI Match Today