- Advertisement -
అహ్మాదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్(49) రనౌట్ అయ్యాడు. దీంతో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రిషబ్ పంత్(18), విరాట్ కోహ్లీ(18)లు ఔటౌన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసకున్నాడు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబట్టారు. దీంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. అయితే, హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన రాహుల్ సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సూర్యకుమార్(47), వాషింగ్టన్ సుందర్(12)లు ఉన్నారు.
IND vs WI 2nd ODI: KL Rahul dismissed for 49
- Advertisement -