Monday, December 23, 2024

రాణించిన రాహుల్, సూర్యకుమార్.. భారత్ 237/9

- Advertisement -
- Advertisement -

అహ్మాదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా, విండీస్ జట్టుకు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(5), రిషబ్ పంత్(18)లోపాటు విరాట్ కోహ్లీ(18)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్(64), కెఎల్ రాహుల్(49)లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి జట్టకు 91 పరుగుల భారీ భాగస్వామ్యాని అందించారు. తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్(24), దీపక్ హుడా(9)లు కూడా పెద్ద స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో స్మిత్, జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రోచ్, హోల్డర్, ఎలెన్, హుసేన్ లకు తలో వికెట్ పడింది.

నాలుగో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్(49) రనౌట్ అయ్యాడు. దీంతో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రిషబ్ పంత్(18), విరాట్ కోహ్లీ(18)లు ఔటౌన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసకున్నాడు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబట్టారు. దీంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. అయితే, హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన రాహుల్ సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సూర్యకుమార్(47), వాషింగ్టన్ సుందర్(12)లు ఉన్నారు.

 IND vs WI 2nd ODI: Windies needs 238 runs to win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News