Monday, December 23, 2024

భారీ స్కోరు దిశగా భారత్

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : రెండో టెస్టులోనూ ఆతిధ్య విండీస్ జట్టు 255 పరుగలకే కుప్పకూలింది. ఆదివారం నాలుగోరోజు ఆట ప్రారంభమైన తొలి సెషన్‌లోనే చాపచుట్టేశారు. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (5/60) దెబ్బకు గంటలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. షానన్ గాబ్రియెల్‌ను సిరాజ్ ఎల్‌బిగా ఔట్ చేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంరతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లలో రోహిత్ శర్మ(57), యషశ్వి జైశ్వల్(38) పరగులు చేసి ఔటవగా.. శుభమన్‌గిల్ (10), ఇషాన్ కిషన్(8) పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో భారత్ స్కోరు 301కి చేరింది. కాగా, 14.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News