Wednesday, January 22, 2025

భారత్ క్లీన్ స్వీప్ ఆశలపై నీళ్లు..

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. సోమవారం ఆఖరి రోజు ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయ్యింది. దీంతో రెండో టెస్టులో వెస్టిండీస్ డ్రాతో బయటపడింది. ఇక తొలి టెస్టులో గెలిచిన టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే చివరి మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత్ కీలకమైన డబ్లూటిసి పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే డబ్లూటిసి ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకునేది. అయితే మ్యాచ్ డ్రా కావడంతో భారత్ మొదటి స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. శ్రీలంకతో తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్థాన్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు భారత్‌వెస్టిండీస్ రెండో టెస్టు ఫలితాన్ని వరుణుడు దెబ్బతీశాడు. చివరి రోజు కురిసిన భారీ వర్షంతో ట్రినిడాడ్ స్టేడియం తడిసి ముద్దయ్యింది. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో ఆట సాధ్యం కాలేదు. పలుసార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరికి ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. 365 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేయగా, విండీస్ 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 183 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News