Monday, December 23, 2024

పోరాడుతున్న వెస్టిండీస్

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. శనివారం మూడో రోజు తాజా సమాచారం లభించే సమయానికి 64 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అయితే టీమండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే విండీస్ మరో 298 పరుగులు చేయాలి. ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించి శుభారంభం అందించారు. చందర్‌పాల్ 33 పరుగులు చేశాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన కిర్క్ మెకంజీ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన క్రెగ్ బ్రాత్‌వైట్ 67 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News