Monday, December 23, 2024

పంత్, శ్రేయస్ అర్థ శాతకాలు..

- Advertisement -
- Advertisement -

అహ్మాదాబాద్‌: వెస్టిండీస్‌తో జ‌ర‌ుగ‌ుతున్న మూడ‌వ వ‌న్డేలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లు అర్థ శతకాలు నమోదు చేశారు. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(13), విరాట్ కోహ్లీ(0), ధావన్(9)ల వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, శ్రేయస్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. వీరిద్దరూ కలిసి 110 పరుగుల భాగస్వమ్యాన్ని అందించారు. ఆ తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి పంత్ ఔట్(56) అయ్యారు. దీంతో భారత్ 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్(0), శ్రేయస్ అయ్యర్(60)లు ఉన్నారు.

IND vs WI 3rd ODI: Pant dismissed by Hayden Walsh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News