Monday, December 23, 2024

చివరి వన్డేకు వర్షం అడ్డంకి..

- Advertisement -
- Advertisement -

IND vs WI 3rd ODI: Rain Stops Play

ట్రినిడాడ్: భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో, చివరి వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మొదటి వికెట్‌కు 113 పరుగులు జోడించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ధావన్ ఏడు ఫోర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే భారత్ స్కోరు 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు ఉన్నప్పుడు వర్షం మొదలైంది. దీంతో ఆటను నిలిపి వేశారు. అప్పటికీ గిల 51, అయ్యర్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.

IND vs WI 3rd ODI: Rain Stops Play

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News