Wednesday, January 22, 2025

మూడో టీ20: భారత్ బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

IND vs WI 3rd T20: WI win toss and opt bowl

కోల్‌క‌తా: టీమిండియాతో జరుగుతున్న చివరి మూడో టీ20లో వెస్టిండీస్ జట్టు ట్యాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కు విశ్రాంతి ఇచ్చారు. వారి  స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్ లను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ తో అవేష్ ఖాన్ ఇంటర్నేషనల్ క్రికేట్ లోకి అరంగ్రేటం చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ తరుపున రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిష‌న్‌ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు టీ20లను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్ కూడా గెలుపొంది క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

IND vs WI 3rd T20: WI win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News