Thursday, January 23, 2025

నేడు వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి టీ20..

- Advertisement -
- Advertisement -

IND vs WI First T20 Match on Today

కోల్‌కతా: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌, భారత్ జట్లు బుధవారం తొలి ట్వంటీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న రోహిత్ శర్మ సేన.. ఈ టి20 సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. అయితే కీలక ఆటగాళ్లు గాయం కారణంగా దూరం కావడం టీమిండియాకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పాలి. ఇక గాయంతో చివరి రెండు వన్డేలకు దూరమైన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ టి20 సిరీస్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతను తొలి టి20లో ఆడతాడని విండీస్ జట్టు యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IND vs WI First T20 Match on Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News