Monday, December 23, 2024

విండీస్‌తో సిరీస్ భారత్‌కు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

IND vs WI T20 Squad to start from Feb 6th

మన తెలంగాణ/క్రీడా విభాగం: దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సవాల్‌గా మారింది. కొంత కాలంగా టీమిండియా అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఒకప్పుడూ భారత జట్టులో ఎదురులేని శక్తిగా కొనసాగిన విరాట్ కోహ్లికి ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొంది. మూడు ఫార్మాట్‌ల కెప్టెన్సీకి కోహ్లి దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. ఇక సౌతాఫ్రికా సిరీస్‌లో భారత్ టెస్టులు, వన్డేల్లో ఓటమి పాలైంది. ఇలాంటి స్థితిలో విండీస్‌తో జరిగే సిరీస్ భారత్‌కు పరీక్షగా మారింది. ఫిబ్రవరి ఆరు నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, మరో 3 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అయితే ఈ సిరీస్‌లో జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. జట్టు ఎంపికలో ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక చాలా కాలం తర్వాత బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ ఎలా ఆడతాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విండీస్ సిరీస్‌కు అతను ప్రత్యేక ఆకర్షణగా మారాడు. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ సారథ్యం వహిస్తున్న సిరీస్ ఇదే కావడం దీనికి ప్రాధాన్యత నెలకొంది.

ఇక సౌతాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్, కెఎల్.రాహుల్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. రిషబ్ పంత్ కూడా ఒకటి రెండు ఇన్నింగ్స్‌లలో మాత్రమే రాణించాడు. శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లతో పాటు కొత్తగా ఎంపికైన దీపక్ హుడా తదితరులకు కీలకంగా మారింది. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన ఒత్తిడి వీరిపై ఎలాగో ఉంటుంది. ఇలాంటి స్థితిలో బలమైన విండీస్‌ను వీరు ఎలా ఎదుర్కొంటారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేగాక సిరీస్ రోహిత్ నాయకత్వ ప్రతిభకు పరీక్షగా మారిందనడంలో సందేహం లేదు. రోహిత్‌తో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఇది సవాల్ వంటిదే. సౌతాఫ్రికా సిరీస్‌లో ఓటమి ద్రవిడ్‌కు ఇబ్బందికరంగా తయారైంది. జట్టులో నెలకొన్న విభేదాలను పరిష్కరించి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత ద్రవిడ్‌పై నెలకొంది. రోహిత్ కూడా తన మార్క్ కెప్టెన్సీతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం ఒక్కటే టీమిండియా ప్రధాన సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో సొంత గడ్డపై భారత్ వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

IND vs WI T20 Squad to start from Feb 6th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News