Monday, November 18, 2024

అదరగొట్టిన జెమీమా.. రెండో వన్డేలో భారత్ విజయం

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళా క్రికెట్ టీమ్ 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్‌షోతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన రోడ్రిగ్స్ 3 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. దేవిక వైద్య మూడు వికెట్లు తీసి తనవంతు సహకారం అందించింది.

భారత బౌలర్లు ప్రారంభం నుంచే కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి బంగ్లా బ్యాటర్లను హడలెత్తించారు. ఓపెనర్ ముర్షిదా ఖాతున్ (12), ఫర్జానా హక్ (47), రితు మోని (27) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగతావారు విఫలం కావడంతో బంగ్లాకు ఘోర పరాజయం తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను జెమీమా ఆదుకుంది. ధాటిగా ఆడిన జెమీమా 9 ఫోర్లతో 86 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (36), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (52), హర్లిన్ డియోల్ (25) తమవంతు పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News