Monday, January 20, 2025

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

- Advertisement -
- Advertisement -

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత జట్టు రికార్డు నెలకొల్పింది. ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆతిథ్య భారత మహిళా జట్టు 347పరుగులతో తేడాతో రికార్డు విజయం సాధించింది. దీంతో మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్టుగా టీమిండియా నిలిచింది.

ఈ ఏకైక టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగులకు ఆలౌటైవ్వగా.. 186/6 వద్ద రెండో ఇన్నింగ్న్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్న్ లో 131 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News