Wednesday, January 22, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ లక్ష్యం 216

- Advertisement -
- Advertisement -

హమిల్టన్‌ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు, భారత్‌కు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు ఆదిలోనే ఫాక్ తగిలింది. ఓపెనర్ సుజీ బాట్స్(5) రన్ఔట్ అయ్యింది. దీంతో 9పరుగులే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అమెలియా(50), అమి(75)లు అర్థశతకాలతో రాణించి జట్టును ఆడుకున్నారు. సోఫీ డివైన్(35), క్యాటీ మార్టిన్(41)లు ఫర్యాలేదనిపించారు. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో రాణించగా.. రాజేశ్వర్ గైక్వాడ్ రెండు వికెట్లు, దీప్తి శర్మ, ఝులన్ గోస్వామి తలో వికెట్ పడగొట్టారు.

Ind W Need 261 runs to win Against NZ W

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News