Monday, January 20, 2025

లార్డ్‌లో ఇంగ్లండ్‌తో భారత మహిళల టెస్టు సమరం

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడాలనే భారత మహిళా క్రికెట్ టీమ్ కల నెరవేరనుంది. 2026లో భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. చారిత్రక లార్డ్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. భారత మహిళా టీమ్ తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.

2026లో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత్ లార్డ్‌లో ఏకైక మ్యాచ్‌లో తలపడనుంది. వచ్చే ఏడాది కూడా భారత మహిళా టీమ్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. 2025లో భారత టీమ్ వన్డే, టి20 సిరీస్‌లలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. తాజాగా 2026లో టెస్టు మ్యాచ్ కూడా ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News