రాజ్‌కోట్: వన్డేల్లో భారత మహిళల క్రికెట్ జట్టు విజయ దుందుభి కొనసాగిస్తోంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస సిరీస్‌లను గెలుచుకుంటోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ విజయం సాధించి, ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (102) అద్భుత సెంచరీతో చెలరేగగా.. టాప్ ఆర్డర్‌లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన (73), ప్రతిక రావల్ (67), హర్లీన్ డియోల్ (89) సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీలతో భారత్‌కు శుభారంభాన్ని అందించారు. దీంతో టీమిండయా 370 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
గతంలో భారత అమ్మాయిలు అత్యధిక స్కోర్ 358/2గా ఉంది. 2017లో ఇదే ఐర్లాండ్ జట్టుపై భారత్ 2 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్‌లోనూ టీమిండియా, విండీస్‌పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేయడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. భారత బౌలర్ల ధాటికి విలదొక్కులేక పోయింది. దీంతో ఆ జట్టు 7 వికెట్లు నష్టానికి కేవలం 254 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. కౌల్టర్ (80) మినహా ఎవరూ రాణించలేక పోయారు. దీంతో 116 పరుగుల తేడా భారత్ విజయం సాధించింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రియా మిశ్రా 2, సాధు, సయాలి తలో వికెట్ తీశారు.