విశాఖపట్నం: సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ అవకాశాలను భారత్ సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు టి20లలో దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. క్లాసెన్ 29పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారిలో హెండ్రిక్స్(23), పార్నెల్ 22(నాటౌట్) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో చాహల్ మూడు, హర్షల్ పటేలు నాలుగు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ధాటిగా ఆడిన రుతురాజ్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో వేగంగా 57 పరుగులు చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ రెండు సిక్స్‌లు, ఐదు బౌండరీలతో 35 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. ఇక హార్దిక్ పాండ్య 31 (నాటౌట్) కూడా రాణించడంతో భారత్ భారీ స్కోరును సాధించింది.
IND Win by 48 Runs against NZ in 3rd T20