Wednesday, December 18, 2024

రాంచీ టెస్టు భారత్‌దే

- Advertisement -
- Advertisement -

రాంచీ: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలుపొందింది. నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(55), శుబ్‌మన్ గిల్(52 నాటౌట్), ధ్రవ్ జురెల్(39నాటౌట్), యశస్వి జైస్వాల్(37), రవీంద్ర జడేజా(04) రజత్ పాటీదర్(0), సర్ఫరాజ్ ఖాన్(0) పరుగులతో చేసి ఔటయ్యారు.  రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా జోయ్ రూట్, టామ్ హార్ట్‌లీ చెరో ఒక వికెట్ తీశారు. ధ్రువ్ జురెల్ రెండో ఇన్నింగ్స్ లలో 90, 39 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సిరీస్ లో భారత్ 3-1 తేడాతో ముందంజలో ఉంది.

ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 353
టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 307
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్: 145

టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్: 192

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News