Friday, November 22, 2024

శాసన సభ నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆదివారం ముగిశాయి. సభను నిరవధికంగా వా యిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ నెల (3వ తేదీన) గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ లో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆదివా రం శాసనసభలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఉద్యమంలో ఎదురైన సవాళ్లను సభ్యులు గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర అ భివృద్ధి సాధించిన తీరును సభ్యులు వివరించారు. సిఎం ప్రసంగం ముగిసిన అనంత రం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది.

ప్రతిపక్ష, అధికార పక్ష నాయకులకు స్పీకర్ ధన్యవాదాలుఅలాగే పురపాలక చట్టం సవరణ బిల్లును సైతం మంత్రి కెటిఆర్ శాసనసభలో ప్రవేశపెట్టగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకుధన్యవాదాలు తెలిపారు. 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించానని శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష, అధికార పక్ష నేతలతో పాటు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది సెషన్‌లలో సభ సజావుగా సాగేందుకు, పద్దులపై చర్చించేందుకు, ప్రశ్నలకు జవాబులు ఇప్పించేందుకు సహకరించిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News