మన తెలంగాణ/ జనగామరూరల్ : ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) నిరవధిక సమ్మె బాటపట్టారు. శనివారం 2వరోజు సమ్మెను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొనసాగించారు. నిరవధిక సమ్మె చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019 నుంచి విధులు నిర్వహిస్తున్న తమను సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు అమలుకు నోచుకోడం లేదన్నారు.
Also Read: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. తిట్టిన ప్రతిసారీ ఓడుతోంది : ప్రధాని మోడీ
గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పల్లె ప్రగతి కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించినా తమను గుర్తించడంలేదని వాపోయారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది విధులు నిర్వహిస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ పంచాయతీ సెక్రటరీలు మనోహర్, స్వామి, ఇఫ్తకారుద్దీన్, వహీద్, మహేందర్, ఈసీ మాధవరెడ్డి, ఈజీఎస్ సిబ్బంది సమ్మె చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముక్కిడి రాజు, కన్న రాజు, శ్రీకాంత్, దివ్య, రేణుక, వెంకటేష్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.