Sunday, December 22, 2024

అలరించిన క్రీడా పోటీలు

- Advertisement -
- Advertisement -

న తెలంగాణ/ హైదరాబాద్: స్వాతంత్ర దినోత్స వేడుకలను పురస్కరించుకుని గురువారం మొయినాబాద్‌లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ (హెచ్‌పిఆర్‌సి) మినీ ఒలింపిక్ స్పోర్ట్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలోతో పాటు స్విమ్మింగ్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. పోలో జూనియర్ హ్యాక్స్ విభాగంలో దీప్ కుక్రెటి విజేతగా నిలిచాడు. ఆర్యన్‌కు రజతం, తాన్వికి కాంస్య పతకం దక్కింది. సీనియర్ విభాగంలో అభినవ్‌కు స్వర్ణం లభించింది.

ఆదిత్య రెండో, హన్నా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక స్విమ్మింగ్ బాలుర అండర్14 ఫ్రిస్టయిల్ 25 మీటర్ల విభాగంలో అక్షజ్ విజేతగా నిలిచాడు. బాలిక విభాగంలో పూర్వి ఛాంపియన్‌గా నిలిచింది. బాలుర అండర్21 ఫ్రిస్టయిల్ విభాగంలో అర్నవ్ స్వర్ణం గెలుచుకున్నాడు.మరోవైపు పురుషుల 50 మీటర్ల బ్రెస్ట్‌స్టోక్ విభాగంలో కున్వర్ కుశాల్ సింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, విజేతలకు హెచ్‌పిఆర్‌సి ఉపాధ్యక్షుడు విజేందర్ సింగ్, విశాల్ సింగ్ తదితరులు బహుమతులు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News