Monday, December 23, 2024

తెలంగాణ పోలీసు అకాడమీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైద్రాబాద్ : తెలంగాణ పోలీస్ అకాడమీలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య సుదర్శన సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్‌లో మొదటగా జాతీయ జెండాను ఆవిష్కరిoచి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. పోలీసు అకాడమీ ఉద్యోగులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 550 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ల ట్రైనింగ్ కోసం ఇన్‌డోర్, ఔట్‌డోర్ అధికారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు. గెజిటెడ్ అధికారుల శిక్షణలో కేంద్ర హోంశాఖ నుండి మూడు సార్లు అవార్డుల రావటం చాలా గొప్ప విషయం అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా మనందరికీ స్వాతంత్య్ర o లభించిందన్నారు. వారి ఆశయాల మేరకు పనిచేసి, పోలీసులకు మంచి శిక్షణ అందించాలన్నారు.

అనంతరం జెడి నవీన కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది మహానుభావులు త్యాగం చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించారని తెలిపారు. వారి త్యాగ ఫలితాన్ని వృథా చేయకుండా దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. కేంద్ర హోంశాఖ నుంచి మూడు సార్లు అవార్డులు రావటం అకాడమీలోని అందరి కృషి ఉందన్నారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా నిర్వహించిన పరేడ్‌కు డీఎస్పీ రాంబాబు కమాండర్‌గా వ్యవహరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ డైరెక్టర్లు అనసూయ, డాక్టర్ జానకి షర్మిల, నర్మద, రాఘవరావు, శ్రీరామమూర్తి, ఎడిలు గంగారెడ్డి, వెంకట్రావు, రమణ, భూపాల్, వి.శ్రీనివాస్‌రావు, శ్రీదేవి, డిఎస్పీలు సంతోష్ కుమార్, ఆదూరి శ్రీనివాస్‌రావు, అమృతారెడ్డి, కృష్ణప్రసాద్, దేవరెడ్డి, భాస్కర్, నరహరి, మజీద్, కృష్ణ, లా ఎడి రాజేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ డాక్టర్ రమాదేవితో పాటు అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News