Wednesday, January 22, 2025

జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పే ర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఈ కమిషన్ నియమిస్తామన్నారు.రాజకీయాలకు అతీతంగా ఈ కమిషన్‌ను నియమిస్తామని, ఈ కమిషన్‌కు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని ము ఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. శనివా రం సాయంత్రం ఓ ప్రైవేటు చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన పలు అంశాలను పంచుకున్నారు. సిఎం కావడమే లక్ష్యంగా అడుగు వేశానని, అందులో ఎలాంటి అనుమానం లేదని, దాచినా దాగేది కాదనీ సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

నెలరోజుల పాలన, పార్లమెంట్ ఎన్నికలు,రాహుల్‌గాంధీతో తన అనుబంధం, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఈ ఇంటర్వూలో పంచుకున్నా రు. సిఎం అయిన తరువాత, సిఎం కాక ముందు తనలో వచ్చిన మార్పులకు సంబంధించి పలు విషయాలను ఆయన వెల్లడించారు. అధికారంలోకి వస్తామని 100 శాతం న మ్మానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని ముందే చెప్పడానికి రాహుల్ గాంధీనే కారణమన్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణపై పూర్తిస్థా యి స్పష్టత ఉందన్నారు. వార్‌జోన్‌లో ఉన్నప్పుడు కేడర్‌కు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత తనదేనన్నారు. అందుకే అధికారంలోకి వస్తున్నామని ముందే చెప్పానని ఆయన తెలిపారు. డిసెంబర్9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభించామని ఆ రోజు ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు వచ్చినా సస్పెండ్ చేయొద్దని తానే చె ప్పానని, వాళ్లు చేసిన పాపాలు వినడమే వాళ్లకు పెద్ద శిక్ష అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.తాను జడ్‌పిటిసిగా తొలిసారి గెలిచినప్పుడు ఆ స్థాయిలోనే తన మైండ్‌సెట్, ఆలోచనలు ఉండేవని, ఆ తరువాత స్థానిక సంస్థల ఎంఎల్‌ఎ గా ఎన్నికయ్యాక ఆలోచనా పరిధి మళ్లీ పెరిగిందన్నారు.

బాధ్యతలు మారిన ప్రతిసారి ఆ బాధత్యలకు అనుగుణంగా అవగాహన పెంచుకోవాలని, అందుకు అనుగుణంగా ఆలోచనల పరిధిని విస్తృతం చేయాలని ఆయన తెలిపారు. 2006 జూన్‌లో జడ్‌పిటిసి, 2007లో ఎంఎల్‌సి, 2009లో ఎంఎల్‌ఎ, 2014 జూన్‌లో మళ్లీ ఎంఎల్‌ఎ, 2019 జూన్‌లో ఎంపిగా, 2021 జూన్‌లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించానని, ఇలా జెడ్పీటిసి నుంచి పిసిసి అధ్యక్షుడి వరకు పరిణామ క్రమంలో పరిస్థితులను ఆకలింపజేసుకుంటూ అవగాహన కల్పించుకుంటూ తెలియంది తెలుసుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ ముందుకు వచ్చానని ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అగ్రెసివ్‌గా ఉండాలి కాబట్టి అలా ఉన్నానని, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది కీలక బాధ్యత కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.
చంద్రబాబు, వైఎస్‌ఆర్, కెసిఆర్‌లకు గుర్తింపు
1995 తరువాత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ ఈ ముగ్గురూ పాలన పరంగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులని ఆయన తెలిపారు. వారు ప్రజల్లో తమకంటూ చెరగని ఓ ముద్ర వేసుకున్నారన్నారు. ఈ ముగ్గురిని దృష్టిలో ఉంచుకుని పోల్చుకుంటే తనపై బాధ త్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఏమాత్రం తడబడినా రాష్ట్రానికే నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆరోజు పరీక్షలకు ప్రిపేర్ అయిపోయినట్లుగానే పరిపాలనకు వెళ్తానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కెసిఆర్ పార్లమెంట్‌కు వెళ్లిపోతే మేం తారసపడే అవకాశం ఉండదు. కెసిఆర్ ఓడిపోతారని ముందే చెప్పాను. ఎన్నికల నుంచి తప్పుకుంటే కెసిఆర్ కి గౌరవం ఉండేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కెసిఆర్ పట్ల తనకు వ్యతిరేక భావన లేదని, అందుకే ఆసుపత్రిలో ఆయన్ను పరామర్శించానని ఆయన తెలిపారు. ఆపద ఉన్న సమయంలో మనిషిని కలవాలని తనకు రాహుల్‌గాంధీ సూచించారని ఆయన సూచన మేరకు కెసిఆర్‌ను పరామర్శించానని ఆయన పేర్కొన్నారు.
నెల రోజుల పాలన బాగానే సాగింది
నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నానని సిఎం రేవంత్ తెలిపారు. పక్షపాతం లేకుండా పాలన చే యాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. తమ దృష్టి కి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని అనుకుంటున్నానన్నారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో తెలంగాణ శకటం ఉంటుందని, ప్రధాని మోడీతో మాట్లాడి శకటం ప్రదర్శించేలా చేయగలిగానని ఆయన తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిశాక అదనంగా ఐపిఎస్‌ల ను కేటాయించాలని కోరితే దానికి కూడా ప్రధాని, కేంద్ర హోంమంత్రి వెంటనే స్పందించారని ఆయన పేర్కొన్నా రు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చ ర్చించాం. సహకారం అందించాలని కేంద్రమంత్రి నిర్మ లా సీతారామన్‌ను కోరాం. కేంద్రం సహకారం కోసమే మంత్రులను కూడా కలిశాం. గవర్నర్ తమిళిసైను కూడా కలిసి పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరాం. హైకోర్టు సీజేను కలిసి పెండింగ్ అంశాలపై చర్చించా. హైకోర్టు నూతన భవనాల నిర్మాణానికి కొత్త స్థలాలను కే టాయించాం. బాధ్యత కలిగిన వారు ప్రతి అంశాలన్ని రాజకీయ కోణంలో చూడరు. కేంద్ర పెద్దలను కలిసిన త ర్వాత ఈ విషయం స్పష్టమైంది. తాను ఏ పని చేయాలా వద్దా అని 100 సార్లు ఆలోచిస్తానని , చేయాలని అనుకుంటే వెంటనే ముందుకు వెళతానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ గడు వు ముగిసినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ దరఖాస్తులను రెవెన్యూ కార్యాలయాల్లో సమర్పించవ చ్చునని రేవంత్ స్పష్టం చేశారు. అదేవిధంగా రైతు కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. పవర్ ప్రాజెక్టులు, మేడిగడ్డపై కచ్చితంగా న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపారు. నా భార్య, బిడ్డ, నా అన్నాతమ్ముళ్లు అన్ని విషయాల్లో తనకు మద్ధతుగా ఉంటారన్నారు. రాజకీయ ప్రస్థానంలో నా సతీమణి తనకు 100శాతం సపోర్ట్ ఇస్తుందని, తన సోదరులు కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారన్నారు. తన సోదరులు ఏ అధికారులకు ఫోన్లు చేయడం లేదని, అధికారులే కొందరు వెళ్లి కలుస్తున్నారని ఆయన తెలిపారు. మన కదలికలన్నీ గమనిస్తుంటారని, నా సోదరులకు స్ప ష్టంగా చెప్పానని, నా సోదరులు కూడా అన్ని విషయా లు ఆలోచించి నడుచుకుంటారని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన మద్దతు ఉం టుందని, పార్టీకి, షర్మిలకు ఉపయోగపడుతుంటే తాను అన్ని రకాలుగా సాయం చేయడానికి ముందుంటానని ముఖ్యమంత్రి అన్నారు. షర్మిల ఎపికి కాబోయే పిసిసి అ ధ్యక్షురాలు అని ఆయన తెలిపారు.
జగన్ ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు
ఎపి సిఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సాధారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా ముఖ్యమంత్రి అయితే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి అభినందిస్తారు. కానీ, ఎపి సిఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూర్చొని పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని అలాంటిది ఆయన కనీసం కలవకపోవడం ఏమిటో అర్థం కాలేదన్నారు. రాజకీయంగా తప్ప పర్సనల్‌గా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఎపిలో సిఎం జగన్ టికెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరఫున తాను టికెట్ ఇప్పిస్తానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో తానిచ్చిన పార్టీకి వైసిపి నేతలు హాజరవ్వడం, అలా హాజరవైన వారిని ఎపి సిఎం జగన్ తిట్టడంపై రేవంత్ స్పందించారు. ఇటీవల ఓ ఎంపి వెళ్లి జగన్‌ను టికెట్ అడిగితే వెళ్లి రేవంత్ రెడ్డిని అడుక్కో పో అన్నారని ప్రస్తావించగా తమ దగ్గరకు వారు వస్తే టికె ట్ ఇస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎపిలో తమకు కూడా 25 ఎంపిలు, 175 ఎమ్మెల్యే టికెట్లు ఉ న్నాయని రేవంత్ పేర్కొన్నారు. ఎపిలో ఎంపి టికెట్‌లు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మతో ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎపిలో జగన్‌కు, చంద్రబాబుకు ఎన్ని బి ఫాంలు ఉన్నాయో తమకు అన్నే ఉన్నాయని రేవంత్ బ దులిచ్చారు. 2 ఎంపీ సీట్లు ఉన్న బిజెపి ఇవాళ 302 సీట్ల కు ఎదగలేదా అని ఆయన తెలిపారు.కాంగ్రె స్ పని ఖతం అని అన్నారు. ఇవాళ అధికారం చేపట్టలేదా?. ఎపిలోనూ కాలం కలిసొస్తే కాంగ్రెస్ అధికారం చేపట్టే ఛాన్స్ ఉందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.జగన్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తానని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. కర్ణాటకతో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కలిసి చర్చించుకుంటామని సిఎం తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయాం, మ నుషులుగా కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నా
పార్లమెంట్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నెల రోజులపాటు ఏ రకంగా పాలన చేశామో, భవిష్యత్‌లోనూ అలాగే ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీలతో ఓటు అడగాలని తాను అనుకుంటున్నానని, ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు పరోక్షంగా పొత్తు పెట్టుకుంటాయని, ప్రత్యక్షంగా వాళ్లు పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఇంకా మేలు కలుగుతుందన్నారు. సిఎం పదవిని చాలా మంది ఆశించినా తానేమీ ఫీల్ కాలేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎంఎల్‌ఎలు, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించానని ఆయన తెలిపారు. ఏ రకంగా చూసినా తనకు అన్ని అంశాలు కలిసొచ్చాయన్నారు. తప్పుడు మార్గాలను ఎంచుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించాలని చూడ టం లేదన్నారు. ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే అప్పటి పరిస్థితులను బట్టి గేమ్ మారుతుంద న్నారు. అలాంటి చర్యలు తెలంగాణలో జరగకూడదని అనుకుంటున్నానని. ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉంటుందని అనుకుంటున్నానని సిఎం పేర్కొన్నారు.
డిసెంబర్ చివరినాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ
2 లక్షల ఉద్యోగాలను డిసెంబర్ చివరినాటికి భర్తీ చేస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. రైతుల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెలాఖరులోగా పార్టీ కోసం టికెట్‌లు త్యాగం చేసిన వారికి, సీనియర్ నాయకులకు పదవులు వచ్చేలా చూస్తానని, ఇదే విషయమై ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడానని ఆయన తెలిపారు. మైనార్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని దానికోసం మైనార్టీ నాయకుడిని ఎమ్మెల్సీగా చేయాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఆయన తెలిపారు. మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. త్వరలోనే ఇరిగేషన్‌కు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేస్తామని సిఎం రేవంత్ తెలిపారు. దీనికి సంబంధించిన శ్వేతపత్రం ఇప్పటికే తాము వెల్లడించాలనుకున్నా అధికారులు సహకరించడం లేదని సిఎం పేర్కొన్నారు. త్వరలోనే దీనిని కూడా వెల్లడిస్తామన్నారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మ న్, సభ్యుల రాజీనామాను ఆమోదించాకే కొత్త కమిటీని వేస్తానని సిఎం రేవంత్ తెలిపారు. కొత్త కమిటీ లేకుండా పరీక్షల నిర్వహణ కష్టమని, ఫలితాలను ప్రకటించలేమని ఆయన తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులు ఇకపై కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News