Wednesday, January 22, 2025

239 సార్లు నామినేషన్.. రాజకీయ దిగ్గజాలపై పోటీ

- Advertisement -
- Advertisement -

ఎలక్షన్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్.. నామినేషన్ వెయాల్సిందే. అలా వేసిన నామినేషన్లు ఎన్నో తెలుసా.. ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో నిమినేషన్ వేశారు. అందుకే ఆయనను ఎలక్షన్ కింగ్ అని పిలుస్తుంటారు. ఆయనే తామిళనాడుకు చెందిన పద్మరాజన్. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల బరిలోనూ దిగుతున్నారు ఈయన. త్వరలో జరగబోయే ఈ ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెండ్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. దీంతో ఆయన నామినేషన్ కూడా వేశారు.

ఈ సందర్భంగా ఎలక్షన్ కింగ్ పద్మరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. 239వ సారి నామినేషన్ వేసినట్లు చెప్పారు. ప్రపంచ రికార్డు కొట్టేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఓటమి అంటేనే ఇష్టమన్నారు. ఇప్పటవరకు తాను మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్, ఎల్ కె అద్వానీ, దివంగత డిఎంకె అధినేత కరుణానిధి, దివంగత ఎఐఎడిఎంకె అధినేత, మాజీ ముఖ్యమంత్రి జయ లలిత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప వంటి రాజకీయ దిగ్గజాలపై పోటీ చేసినట్లు తెలిపారు. ఒక ఎలక్షన్ తో తనకు అత్యధికంగా 6వేల ఓట్లు వచ్చినట్లు పద్మరాజన్ చెప్పారు. తాను ఎన్నికల్లో గెలువాలని కోరుకోను.. ఓడిపోవాలనే కోరుకుంటానని చెప్పారు.

188 నుంచి ఎలక్షన్ నామినేషన్ కోసం తాను దాదాపు రూ.కోటి వరకు బ్యాంకులో డిపాజిట్ చేశానని చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతంలోనే ఒక చిన్న పంక్చర్ షాప్ నడిపిస్తూ అదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. దాని నుంచి వచ్చే ఆదాయంతో ఈ డిపాజిట్ మొత్తాలను చెల్లిస్తానని ఆయన తెలిపారు. అధ్యక్ష ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, వార్డు ఎన్నికలతో సహా తాను అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేసినట్లు చెప్పారు. లోక్ సభ ఎలక్షన్ తర్వాత కూడా తాను ఎన్నికల్లో పోటి చేస్తానని పద్మరాజన్ చెప్పుకొచ్చారు. కాగా, ఇన్నిసార్లు నామినేషన్ వేసినా.. ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News