Sunday, December 22, 2024

ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి: మోడీ

- Advertisement -
- Advertisement -

స్రవస్థి(యూపీ):  విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని, అది వ్యాపిస్తే దేశాన్నే నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యూపీలోని స్రవస్థిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విప‌క్ష ఇండియా కూట‌మికి మ‌త‌త‌త్వం, తీవ్ర జాతి వివ‌క్ష‌, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయ‌న్నారు. ఇవి క్యాన్స‌ర్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులన్నారు.

మోదీ దేశ‌వ్యాప్తంగా 4 కోట్ల మంది పేద‌ల‌కు ఇళ్ళు ఇచ్చార‌ని, ఇప్పుడు సమాజ్‌వాది, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వ‌స్తే అన్నింటినీ తారుమారు చేస్తార‌ని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేద‌ల‌కు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకుని వాటిని త‌మ ఓటు బ్యాంకుకు పంచివేస్తాయని ఆరోపించారు. తాను ప్రారంభించిన 50 కోట్ల‌కు పైగా జ‌న్ ధ‌న్ ఖాతాల‌ను మూసివేసి ఆ డ‌బ్బును వారు లాగేసుకుంటార‌ని విమర్శించారు. మోడీ ప్ర‌తి గ్రామానికి విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పిస్తే విప‌క్షాలు విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను క‌ట్ చేసి మ‌ళ్లీ చీకట్లోకి తీసుకువెళతాయన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News