- Advertisement -
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(120), సాహా(25)లు ఉన్నారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు శుభ్ మన్ గిల్(44), మయాంక్ శుభారంభం అందించారు. అయితే, అర్థశతకం చేరువగా వచ్చిన గిల్ ను ఔట్ చేసిన కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)లను ఒకే ఓవర్ లో ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. అనంతరం వచ్చిన శ్రేయస్ అయ్యర్(18)ను కూడా క్రీజులో నిలుదొక్కుకోకుండా పెవిలియన్ పంపించాడు. భారత జట్టు కోల్పోయిన నాలుగు వికెట్లు అజాజ్ కే దక్కాయి.
India 221/4 at Stumps in day 1 against NZ
- Advertisement -