Friday, November 22, 2024

కోహ్లీ సేన శుభారంభం..

- Advertisement -
- Advertisement -

శతకంతో చెలరేగిన కెఎల్ రాహుల్.. కోహ్లీ సేన శుభారంభం..

రాణించిన మయాంక్ అగర్వాల్, రహానె
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9×4, 60), కెఎల్ రాహుల్(248 బంతుల్లో 17×4, ఒక సిక్స్‌తో 122), విరాట్ కోహ్లీ(35), అజింక్యా రహానె(40) నిలకడగా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కాగా, సఫారీ బౌలర్లలో ఎన్‌గిడి మాత్రమే మూడు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన ఓపెనర్లు సఫారీ బౌలర్లను గౌరవిస్తూనే వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. లంచ్ బ్రేక్ సమయానికి 83 పరుగులు మాత్రమే చేశారు. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు ఎక్స్‌ట్రా బౌన్స్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడారు. 18 బంతుల తర్వాత గానీ కెఎల్ రాహుల్ పరుగుల ఖాతా తెరవలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరు ఎంత ఓపిక ఆడారో. ఓవైపు కెఎల్ రాహుల్ డిఫెన్స్‌కు పరిమితమైనా మయాంక్ అగర్వాల్ మత్రం బౌండరీలతో జోరుతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. తొలుత అరంగేట్ర పేసర్ మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లో మయాంక్ అగర్వాల్‌కు లైఫ్ లభించింది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడిన మయాంక్ అగర్వాల్ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. అతని బ్యాట్‌ను తాకిన బంతి.. వికెట్ కీపర్‌కు రైట్ సైడ్‌గా దూసుకెళ్లింది. అయితే ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డికాక్. క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పుడు మయాంక్ వ్యక్తిగత స్కోర్ 36 పరుగులు మాత్రమే. ఈ అవకాశాన్ని అందుకున్న మయాంక్.. తనలోని అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్‌మన్‌తో సఫారీ బౌలర్ల పనిపట్టాడు. జిడ్డూ బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు కెఎల్ రాహుల్ సైతం.. నిదానంగా బ్యాటింగ్ చేశాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్నాడు. సఫారీలతో వారి సొంత గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికీ బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు. కాగా, ఈ మ్యాచ్లో ముగ్గురు పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లను తుది జట్టులోకి తీసుకున్నామన్నాడు. ఆల్రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌నూ బరిలోకి దింపుతున్నామన్నాడు.

India 272/3 at stumps on day 1 against SA in 1st Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News