Thursday, January 23, 2025

వెస్టిండీస్‌తో రెండో టెస్టు: సెంచరీకి చెరువలో కింగ్ కోహ్లీ..

- Advertisement -
- Advertisement -

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా వెస్టిండీస్ జట్టుపై పై చేయి సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(80), యశస్వి జైస్వాల్‌(57)లు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ పెలివిన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్ (10), అజింక్య రహానె (8)లు మరోసారి నిరాశపర్చినా.. రవీంద్ర జడేజా(36 నాటౌట్)తో కలిసి విరాట్‌ కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలతో అలరించారు. కాగా, కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌. ఈ మ్యాచ్ చెలరేగి ఆడుతున్న కోహ్లీ(87 నాటౌట్) సెంచరీవైపు దూసుకుపోతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News