Friday, December 20, 2024

ఇండియా 326/5

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 49వ సెంచరీ సాధించి, సచిన్ రికార్డును సమం చేయడం విశేషం. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజులోకి వచ్చినప్పటినుంచే ధాటిగా ఆడుతూ, స్కోరును చకచకా పెంచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 40 పరుగులు చేసి, రబడా బౌలింగ్ లో బవుమాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

తర్వాత పదకొండో ఓవర్లో గిల్ 23 పరుగులు చేసి, కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయి, పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కలసి ఇన్నింగ్స్ ను అద్బుతంగా నడిపించారు. శ్రేయస్ ధాటిగా ఆడుతూ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసి, ఎంగిడి బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 227 పరుగులు. శ్రేయస్ స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ క్రీజులో ఎక్కువసేపు ఉండలేదు. ఎనిమిది పరుగులు చేసి, అవుటయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ భారీ షాట్లతో స్కోరును పరుగు పెట్టించేందుకు ప్రయత్నించినా, బౌలర్  షంసీకి దొరికిపోయాడు.

అతను డికాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 121 బంతుల్లో పది ఫోర్లతో 101 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్ మినహా మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీశారు. పేసర్ జాన్సన్ రెండు బంతులు తక్కువగా పది ఓవర్లు వేసి, 94 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News