Wednesday, January 22, 2025

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

India 75 Independence celebrations

హైదరాబాద్: హెచ్‌ఐసిసిలో భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిఎం కెసిఆర్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వజ్రోత్సవాలకు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. అంగరంగా వైభవంగా వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆహుతులను వీణలతో అలరించారు.   75 వీణలపై రఘుపతిరాఘవ రాజారాం, వందేమాతర, సారేజహాసే అచ్చా గేయాలాపన చేశారు. ఇవాళ్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News