- Advertisement -
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 761 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 12 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. తాజాగా నమోదైన మరణాల్లో కేరళలో 5, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తరప్రదేశ్ లో ఒకటి చొప్పున మరణాలు సంభవించాయని తెలిపింది.
కేరళలో అత్యధికంగా 1,249, కర్ణాటకలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో 128 యాక్టివ్ కేసులున్నాయి. డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలలో ఉండేది. చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య కొత్త కోవిడ్–19 వేరియంట్ కేసులు మళ్లీ పెరగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉందని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ పేర్కొంది.
- Advertisement -