Sunday, December 22, 2024

తీరు మారని బ్యాటర్లు

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడో, చివరి టెస్టులోనూ ఆతిథ్య టీమిండియాకు బ్యాటింగ్ కష్టాలు తప్పడం లేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు మరోసారి విఫలమయ్యారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత స్పిన్పర్లు సఫలమయ్యారు. అయితే తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు కష్టాలు తప్పలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు ఆరంభంలో బాగానే ఆడారు.

అయితే 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన రోహిత్‌ను మ్యాట్ హెన్రీ పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి యశస్వి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే 52 బంతుల్లో 30 పరుగులు చేసిన జైస్వాల్‌ను ఎజాజ్ పటేల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాతి బంతికే సిరాజ్ కూడా ఔటయ్యాడు. అతను ఖాతా కూడా తెరవలేక పోయాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కోహ్లి మరోసాని నిరాశ పరిచాడు. 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఆట ముగిసే సమయానికి గిల్ (31), రిషబ్ పంత్ (1) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి టీమ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 149 పరుగులు చేయాలి.

తప్పేసిన స్పిన్నర్లు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్, డారిల్ మిఛెల్‌లు తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. యంగ్ (71), మిఛెల్ (82) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. జడేజా ఐదు, సుందర్ 4 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News