Wednesday, January 22, 2025

కేఎల్ రాహుల్ విఫలం.. భారత్ ఎ 161 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్ ఎ, ఆసీస్ ఎ జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 161 పరుగులకే ఆలౌటైంది. ఈ సిరీస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సీనియర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్(4) ఘోరంగా విఫలమయ్యాడు. అతనితోపాటు అభిమన్యు ఈశ్వరన్(0), సాయి సుదర్శన్(0), రుతురాజ్ గైక్వాడ్(4), పడిక్కల్(26), నితీష్ కుమార్ రెడ్డి(16)లు విఫలమయ్యారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. మరో ఎండ్ లో ధ్రువ్‌ జురెల్ అద్భత బ్యాటింగ్ తో అలరించాడు. ఈ క్రమంలో ధ్రువ్(80) భారీ అర్థశతకాన్ని నమోదు చేశాడు. అతని ప్రసిద్ధ్ కృష్ణ(14) సహకారం అందించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News