Sunday, November 3, 2024

ఇండియా-ఎ దీటైన జవాబు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియాబితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఇక ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఇండియా ఎ మరో 187 పరుగులు చేయాలి. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు శుభారంభం అందించారు.

కెప్టెన్ గిల్ 43 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. మయాంక్ అగర్వాల్ 8 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రియాన్ పరాగ్ (27), కెఎల్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇండియాబి మొదటి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. యువ సంచలనం ముషీర్ ఖాన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇండియా ఎ బౌలర్లను దీటు

గా ఎదుర్కొన్న ముషీర్ ఖాన్ 373 బంతుల్లో 16 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 181 పరుగులు చేశాడు. అతనికి నవ్‌దీప్ సైనీ (56) అండగా నిలిచాడు. ఇండియా ఎ బౌలర్లలో ఆకాశ్‌దీప్ నాలుగు, ఖలీల్, అవేశ్ ఖాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News