Saturday, December 21, 2024

ఆరో వికెట్ కోల్పోయి ఇండియా ఎ జట్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు 25 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా బి జట్టు 172 పరుగుల ఆధిక్యంలో ఉంది.  ఇండియా బి ఇంకా నాలుగు వికెట్లు తీస్తే చాలు గెలుస్తుంది. ధ్రువ్ జురెల్, తనౌష్ కోటియన్ డకౌట్ కావడంతో ఇండియా ఎ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇండియా ఎ జట్టు బ్యాట్స్‌మెన్లలో రియాన్ పరాగ్(31), శుభ్‌మన్ గిల్(21), శివమ్ దూబే(14), మాయంక్ అగర్వాల్(03) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(31), కుల్దీప్ యాదవ్(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా బి జట్టు బౌలర్లలో యశ్ దయాల్ మూడు వికెట్లు తీయగా ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, నితీశ్ రెడ్డి తలో ఒక వికెట్ తీశారు.

ఇండియా బి తొలి ఇన్నింగ్స్: 321
ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్: 231
ఇండియా బి సెకండ్ ఇన్నింగ్స్: 184

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News