Wednesday, January 22, 2025

రికీ శతకం వృథా…. ఇండియా డిపై గెలిచిన ఇండియా ఎ

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డిపై ఇండియా ఎ జట్టు విజయం సాధించింది. ఇండియా డి జట్టుపై ఇండియా ఎ జట్టు 186 పరుగులు తేడాతో గెలుపొందింది. ఇండియా డి జట్టులో రికీ భూయ్ ఒక్క సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బాట్స్‌మెన్లు విఫలంకావడంతో 82.2 ఓవర్లలో 301 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇండియా డి జట్టు ఓటమిని చవిచూసింది. ఇండియా డి జట్టు బ్యాట్స్‌మెన్లలో రికీ భూయ్(113), శ్రేయస్ అయ్యర్(40), సంజూ శామ్సన్(40), యాశ్ దుబే(37), సౌరభ్ కుమార్(22), హర్షిత్ రాణా(24), అర్షదీప్ సింగ్(07 నాటౌట్), అథర్వ టైడ్(0), సరాన్ష్ జైన్(05), దేవదూత్ పడిక్కల్(01), విద్వాత్ కావేరప్పా(0) పరుగులు చేశారు. ఇండియా ఎ జట్టు బౌలర్లలో తనౌష్ కోటియన్ నాలుగు వికెట్లు, శామ్స్ ములానీ మూడు వికెట్లు, ఖలీల్ అహ్మద్, రియాన్ పరాగ్ తలో ఒక వికెట్ తీశారు.

ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్: 290
ఇండియా ఎ సెకండ్ ఇన్నింగ్స్: 380
ఇండియా డి తొలి ఇన్నింగ్స్: 183
ఇండియా డి సెకండ్ ఇన్నింగ్స్: 301

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News