Monday, December 23, 2024

ఇండియా-ఎ జయకేతనం

- Advertisement -
- Advertisement -

India A won the first ODI against New Zealand A

చెన్నై: న్యూజిలాండ్‌ఎతో జరిగిన తొలి వన్డేలో ఇండియాఎ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇండియా సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 31.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. లక్షఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీషా (17) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. రుతురాజ్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. త్రిపాఠి 4 ఫోర్లతో 31 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ 29 (నాటౌట్), రజత్ పటిదార్ 7 ఫోర్లతో 45 (నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా భారత్‌కు విజయం సాధించి పెట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను ఇండియా బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. శార్దూల్ నాలుగు, కుల్దీప్ సేన్ మూడు వికెట్లు తీశారు. ప్రత్యర్థి జట్టులో రిపొన్ (61), వాకర్ (36) మాత్రమే రాణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News