న్యూయార్క్: ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా చేజిక్కించుకోవడాన్ని ఖండిస్తున్న ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కంబోజ్ ప్రతిస్పందిస్తూ ఇటీవల నెలకొన్న పరిస్థితికి భారత్ చాలా డిస్ట్రబ్ అయిందన్నారు. సమస్య పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గమన్నారు. ఐక్యరాజ్యసమితి ఓటింగ్ కు భారత్ దూరం అయ్యాక ఆమె ఈ విధంగా చెప్పారు. ఉక్రెయిన్ భాగాలను కలుపుకోవడానికి రష్యా చేపట్టిన రిఫరెండమ్(ప్రజాభిప్రాయ సేకరణ)ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించడమే కాక ఓటింగ్ నిర్వహించింది. దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. హింసాత్మక కార్యకలాపాలను కూడా రష్యా వెంటనే ఆపేయాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. 15 దేశాల భద్రతా మండలి ఉక్రెయిన్లో నిర్వహించిన రెఫరెండమ్ ను ఖండించింది. దాని ముసాయిదా తీర్మానాన్ని అమెరికా, అల్బెనియా ప్రవేశపెట్టాయి. భారత్ తో పాటు చైనా, గబన్, బ్రెజిల్ దేశాలు కూడా ఓటింగ్ కు గైర్హాజరు అయ్యాయి. కాగా భారత్ అంతర్జాతీయ సముదాయంతో కలిసి పనిచేయగలదని రుచిర కంబోజ్ తెలిపారు. భారత్ దృక్పథం మానవతావాదంతో కూడుకున్నదని కూడా తెలిపారు.
#WATCH via ANI Multimedia | India abstains from UN Vote on Russian referendum in 4 Ukrainian regionshttps://t.co/7rxt38R7jn
— ANI (@ANI) October 1, 2022