Saturday, November 23, 2024

ఒకే రోజు భారీ సంఖ్యలో కరోనా టీకా వేసిన ఘనత భారత్‌దే

- Advertisement -
- Advertisement -

India Achieved a world record in vaccination

 

2,24,301మందికి టీకా
447మందికి స్వల్ప సమస్యలు, ముగ్గురికి ఆస్పత్రుల్లో చికిత్స
ఆదివారంనాడు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డు సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు టీకా అందించిన ఘటన భారత్‌కు మాత్రమే దక్కిందని, ఈ విషయంలో అమెరికా, యుకె, ఫ్రాన్స్ దేశాలు కూడా మన తర్వాతే నిలిచాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారంనాటికి దేశవ్యాప్తంగా 2,24,301మందికి కొవిడ్ టీకాలను ఇచ్చినట్లు పేర్కొంది. మొదటి రోజు శనివారం 2,07, 229మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో దేశమంతటా 447మందికి స్వల్ప జ్వరం, తలనొప్పి లాంటి చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లు తెలిపింది. వారిలో ముగ్గురికి మాత్రమే ఇంకా ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వెల్లడించింది. ఆదివారంనాడు ఆరు రాష్ట్రాల్లో(ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు) వ్యాక్సినేషన్ జరిగిందని, 17,072మందికి 553 కేంద్రాల్లో టీకా అందిందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశం జరిపామని, వారు పేర్కొన్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపామని మనోహర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News