Monday, December 23, 2024

రైతుల హక్కులపై భారత్ చట్టం ప్రపంచానికే నమూనా : ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మొక్కల రకాలను, రైతుల హక్కులను పరిరక్షించడానికి భారత దేశం 2001లోనే చట్టాన్ని తీసుకువచ్చిందని, అది అంతర్జాతీయ స్థాయిలో ఆహార భద్రత, వ్యవసాయానికి సంబంధించి మొక్కల జన్యువనరుల, రైతుల హక్కుల పరిరక్షణకు కుదిరిన ఒప్పందంతో సమానమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలో మంగళవారం పూసా కాంప్లెక్సులో రైతుల హక్కులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు.

భారత్ 2021లో తీసుకువచ్చిన చట్టం మొత్తం ప్రపంచానికే నమూనా అని అభివర్ణించారు. ఈ చట్టం కింద భారత్ రైతుల హక్కులను రక్షిస్తోందని పేర్కొన్నారు. ఈ చట్టం కింద రిజిస్టర్ అయిన బ్రాండ్ లేని విత్తనాలను ఉపయోగించడం, తిరిగి వినియోగించడం, సంరక్షించడం, పంచుకోవడం, విక్రయించడం తదితర హక్కులు రైతులకు దక్కుతాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News